యథావిధిగా ఆర్టీసీ సమ్మె: అశ్వత్థామ రెడ్డి

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌: ఆర్టీసీ భవితవ్యంపై జరగనున్న సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌లో వివిధ కార్మిక సంఘాలతో కలిసి ఐకాస నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఆర్టీసీ రూట్లను ప్రైవేటు పరం చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన సమ్మెపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత రేపు భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేరతామని ప్రకటించి మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించామన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. రేపు ఎంజీబీఎస్‌ బస్టాండులో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *