మ‌రో సంచ‌ల‌నానికి తెరతీయ‌బోతున్న వ‌ర్మ‌

అక్షిత ప్రతినిధి: సినిమా హిట్టా, ఫ‌ట్టా అనే విష‌యం ప‌ట్టించుకోకుండా కేవలం కాంట్ర‌వ‌ర్సీల‌కి సంబంధించిన స‌బ్జెక్ట్‌ల‌ని తీసుకొని సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు వ‌ర్మ‌. రీసెంట్‌గా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో అంద‌రి దృష్టిని త‌న‌వైపుకి తిప్పుకున్న వ‌ర్మ ఈ చిత్రం లో ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుని కాస్త నెగెటివ్ కోణంలో ఆవిష్క‌రించారు. ఇక ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా సోష‌ల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసి .. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఈ కొత్త నటుడు ఏ నిజ జీవిత పాత్ర చేస్తున్నాడో చెప్పగలరా?’ అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు కొద్ది సేప‌టి క్రితం ఫ‌స్ట్ లుక్ లోగో పోస్ట‌ర్‌కి సంబంధించి మోష‌న్ వీడియో రిలీజ్ చేశాడు వ‌ర్మ‌. టైగర్‌, ప్రొడక్షన్‌ కంపెనీ, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌తో ప‌లు సంచ‌ల‌నాలు సృష్టించిన వ‌ర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంతో ఏ చేస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *