మ‌ద్ద‌తు ధ‌ర కై రైతు ఉద్య‌మం…

లౌక్య టీవి- నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులు ఆందొళన బాట పట్టారు. వీరికి పసుపు రైతులు కూడా తోడయ్యారు. సర్కారే తమకు కావాల్సిన గిట్టూ బాటూ ధర కల్పించాలని ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీస్తొంది. పంట సాగు అయిన నాటి నుండి కొనుగోళ్ళ విషయంలో చర్చ నడుస్తున్నా…. అధికారులు గానీ, ప్రభుత్వం గానీ దీని మీద ద్రుష్టి సారించలేదు. తీరా కినుగోలు సమయం ఆసన్నం అయ్యే సరికి మద్దతు ధర విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. మరొ పక్క చట్టాల్లో ఉన్న లోపాలు, రైతుల అవగాహన లోపం, అధికారుల భాద్యతరాహిత్యం వ్యాపారులకు వరంగా మారాయి. దింతో రైతన్న సరిపడ మద్దతు ధర రాక ఆందొళన బాట పడుతున్నాడు.
నిజామాబాద్ జిల్లాలో 48 వేల ఎకరాల్లో ఎర్రజొన్న సాగు చేసారు రైతులు. దాదాపు 1.20 లక్షల క్వింటాళ్ళ దిగుబడి వచ్చీంది, అయితే వ్యాపారులు కేవలం 1600 రూపాయల ధరకి పంటని కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. రైతులు మాత్రం 3500 రూపాయల మద్దతు ధర కల్పించాలంటూన్నారు.
గత సంవత్సరం ఎర్రజొన్న పంటను వ్యాపారులు కొనుగోలు చేయలేదు. పంట చేతికొచ్చి రోజులు గడిచినా వ్యాపారులు కొనకపోవటాంతో రైతులు ఆందోలన చేసారు. రైతుల ఆందొలన నేపద్యంలో ప్రభుత్వమే ముందుకొచ్చి 2300 రూపాయలకు క్వింటాలు చొప్పున కొనుగోలు చేసింది. అయితే కొనుగోలు చేసిన పంటను ఏం చేయాలో అర్థంకాక గోదాముల్లో నిల్వ ఉంచారు. చివరికి 1800 రూపాయలకు క్వింటాలు చొప్పున టెండర్ వేసి విక్రయించారు. ప్రభుత్వం. ఎర్రజొన్న కొనుగోళ్లలొ గత ఏడాది ప్రభుత్వం దాదాపు 70 కొట్లు నష్టపోయింది. దీంతో ఈ సంవత్సరం రైతులు ఎర్రజొన్న పంట పండించొద్దని చెప్పింది. వ్యపారులు ఎవరైనా విత్తనాలు అమ్మితే వారే రైతుల వద్ద పంటని కొనుగోలు చేయాలని నిబందన కూడా పెట్టింది. విత్తనాలు అమ్ముకున్న వ్యాపారులు ఇప్పుడు పంటని మాత్రం కొనుగోలు కు మాత్రం ముఖం చాటేశారు. ఎర్రజొన్న పంటని ఉత్తర భారత దేశంలో పశువుల దాణాగా వాడతారు. ఇక్కడ ఈ పంటని పెద్దగా ఉపయోగించారు. అయితే మన దగ్గర పండే పంటకి ఉత్తర భారతదేశంలో పెద్ద గిరాకీ లేదు. కాని ఈ పంట పండించటం మాత్రం చలా తేలిక. విత్తనాలు చల్లితే చాలు పంట మొలకెత్తుతుంది. తక్కువ ఖర్చుతో ఈ పంట సాగు అవుతుండాటాంతో రైతులు ఈ పంట మీద ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం వద్దన్నా సాగు చేస్తున్నారు, తీరా పంట చేతికొచ్చాక మద్దతు ధర కోసం రోడ్డున పడుతుంన్నారు. తాము పండించిన ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందటున్నారు రైతులు. గత సంవత్సరం కన్నా ఈ సారి తక్కువ ధరకు ఎందుకు కొనుగోలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎర్రజొన్నకి ఇక్కడ గిరాకీ లేకపోవటం, పసుపు కూడా దిగుబడి ఎక్కువ రావటం లాంటి అంశాలతో మద్దతు ధర తగ్గిందంటూన్నారు విశ్లేషకులు. అయితే వ్యాపారుల వాదన మాత్రం మరోలా ఉంది. గతేడాది 2300 రూపాయలు చెల్లించి రైతుల వద్ద పంటని కొనుగోలు చేసిన ప్రభుత్వం 1800 రూపాయలు టెండర్ వేసి అమ్మిందని … మరి తామేలా 2300 రూపాయలకు కొనుగోలు చేయాలో రైతులు చెప్పాలని వ్యాపారులు.అంటున్నారు. ప్రభుత్వం మాత్రం మరోలా వాదన వినిపిస్తోంది. రైతులను ఎర్రజొన్న సాగు చేయోద్దాన్నమని, ఒకవేల చేస్తే ఏ వ్యాపారి వద్ద విత్తనం కొన్నారో అక్కడే పంటని అమ్ముకోవాలని సూచించామని చెబుతుంది. గతేడాది రైతుల కోసం 70 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడిందని…. రైతులు అనాలోచితంగా ఎర్రజొన్న సాగు చేసి ఇలా ఆందోలన పేరుతో ఉద్రిక్తత సృష్టించడం కరక్ట్ కాదంటూన్నారు అధికారులు.
ఏది ఏమైనా మరో సారి రైతులు ఆందోలన బాట పట్టాడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అసలు ఎర్రజొన్న పంట ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ పంటకు అడిగిన ధర ఇవ్వాలని రైతులు రోడ్డున పడటం అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నెల 7న రైతులు మహాధర్నా చేయటాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఐదు రోజులు గడువు ఇచ్చిన రైతులు మళ్ళీ ఈ నెల 12న రెండో సారి రోడ్డెక్కారు. ఆందోలన నేపద్యంలో గ్రామాల్లో పోలిసుల బందోబస్తు, ముందస్తు అరెస్ట్ లు, 144 సెక్షన్ విధింపుతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మరో సారి ఈ నెల 16 న కుటుంబ సమేతంగా ఆందోళనలో పాల్గొనాలని రైతు సంఘాలు పిలువునిచ్చాయి. ఈ సారి ఒకే చోట కాకుండా 3 చోట్ల జాతీయ రహదారులు దిగ్బంధించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. గ్రామ కమిటీ లు కూడా ఈ ఎర్రజొన్న ఉద్యమం లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.రాజకీయ పార్టీ లకు అతీతంగా పార్టీలకు ఈ పోరాటం చేపట్టారు.మూడో దశ ఆందోళనలో నేపద్యంలో ఏం జరుగనుందో అన్న చర్చ నడుస్తుంది. నివురు గాప్పిన నీరులా ఉన్న రైతుల ఆక్రోశం ఎలాంటీ పరిస్థితులకు దారీ తీస్తుందోనని ఆందోళన నెలకొంది.
మద్దతు ధర సాధించేవరకు తమ పోరాటం ఆగదని రైతు నాయకులు హెచ్చరిస్తున్నారు.

Farmer problems
farmer markets
Minimum Price
nizamabad district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *