మొసళ్ళ కలకలం

చింతలపాలెం, ఆగస్టు 25, అక్షిత న్యూస్ :  పులిచింతల ప్రాజెక్టు నుండి వజినేపల్లి గ్రామానికి వెళ్ళే రోడ్డు మధ్యలో ఉన్న కర్త వాగు దగ్గర రోడ్డు పై ఆదివారం చనిపోయిన ముసలి కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామం లోని పులిచింతల ప్రాజెక్టు గత ఇరవై రోజుల నుంచి వరద నీరు రావడంతో వరద నీటిలో మొసళ్ళు కొట్టుకు వచ్చాయి. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం తో నిండుకుండ లాగా అగుపిస్తుంది ప్రస్తుతానికి సాగర్ నుండి వరద ఉధృతి లేకపోవడం వలన ప్రాజెక్టులో మొసళ్ళు మరియు వాటి పిల్లలు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. మూడు రోజుల క్రితం పర్యాటకులకు మొసళ్ళు కనిపించడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో అప్రమత్తమైన అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పర్యాటకులకు తగిన సూచనలు సలహాలు ఇస్తున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున ఒక మొసలి నీటిని వదిలి రోడ్డుపై సంచరిస్తున్న సమయంలో అటుగా వచ్చిన భారీ వాహనం తొక్కడం వలన ముసలి అక్కడికక్కడే చనిపోయింది . ముసలి చనిపోయిన సమాచారాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారులకు అందజేశారు. ముసలి చనిపోయిన సమాచారం తెలుసుకున్న జనం పెద్ద సంఖ్యలో చూడటానికి పోటీపడుతున్నారు. మొసళ్ళు నెమలిపురి వజినేపల్లి పరిసర రోడ్లపై సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. యువకులు చనిపోయిన ముసలిని తమ సెల్ ఫోన్లో సెల్ఫీ లు దిగడం కనిపించింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చనిపోయిన ముసలికి పోస్టుమార్టం చేసి పంచనామా రాసి ఖననం చేశారు.

 

 

 

 

tags : crocodile, chinthalapalem, krishna river

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *