మేఘాలు గర్జిస్తున్నా …జై తెలంగాణ నినాదాలు

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్ : హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్బంగా గురువారం తెరాస అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ హుజూర్ నగర్ లో భారీ బహిరంగ సభ ను తెరాస నాయకులు ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావాల్సి ఉండగా హుజూర్ నగర్ లో భారీ వర్షం కురవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సభ రద్దయిందన్న విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి, ఉప ఎన్నికల ఇంచార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సభ సభా వేదిక పై నుండి ప్రకటించారు. అప్పటి దాకా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నా తెరాస శ్రేణులు ఒక్క సారిగా తీవ్ర నిరాశకు లోనైనట్లు కనిపించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి అక్కడ ఉప ఎన్నికకు బాధ్యత వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ,ముఖ్య నాయకులతో ప్రత్యేక సంమావేశాన్నిఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా హుజూర్ నగర్ సభ రద్దు పై మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. అధినేత వస్తున్నాడని తెలిసి భారీగా తరలివచ్చిన హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు గులాబీ కి జై కొట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.కుంభ వృష్టి కురుస్తున్న అధినేతను చూడాలన్న ఆరాటం ప్రజల్లో తొంగిచూసిందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలను పురస్కరించుకుని గురువారం హుజుర్నగర్ లో జరుగాల్సిన సభ వర్షం కారణంగా రద్దు కావడం పై ఆయన స్పందించారు. తనను కలసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఏర్పాట్లు చేయనప్పటికి సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చారని వర్షం తో సభ అర్దాంతరంగా వాయిదా పడడం తో ప్రజలు కొంత నిరాశ చెందారని అయితే ఈ ఉప ఏన్నికలలో మాత్రం టి ఆర్ యస్ విజయానికి కసితో పని చేయాలన్న తపన కనిపించిందని ఆయన చెప్పారు.ఒకవైపు పిడుగులు పడేంతటి ఉరుములు దిట్టంగా కమ్ముకున్న మేఘాలు భారివర్షం కురుస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఎదురు చూపులే తప్ప ఒక్కరు పక్కకు కదలక పోవడమే నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు.వర్షం కారణంగానే ముఖ్యమంత్రి సభ రద్దు అయిందని ప్రకటించేవరకు ఒక్కరూ పక్కకు కదలక పోవడమే హుజూర్ నగర్ లో గులాబీ విజయానికి సంకేతం అన్నారు

వ్యూహారచన… ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ రద్దు అయిన నేపద్యంలో టి ఆర్ యస్ పార్టీ నేతలు ప్రత్యేకంగా వ్యూహారచనా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.మంత్రి జగదీష్ రెడ్డి ఉపఎన్నికల ఇంచార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ ,కంచర్ల భూపాల్ రెడ్డి శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం 19 న ముగియనున్న నేపద్యంలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతి వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు .

 

 

tags : by elections, hnr, trs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *