(శ్రీనగర్ )పుల్వామా జిల్లాలోని లెత్పురా దగ్గర శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై జరిగిన ఐఈడీ పేలుడులో 39 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారని, 44 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.జమ్మూ, కశ్మీర్లో ఈ మధ్య కాలంలో భద్రతా దళాలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని తెలుస్తోంది.2500 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లతో 78 వాహనాల్లో వెళ్తున్న కాన్వాయ్‌పై గురువారం మధ్యాహ్నం అవంతిపొరలోని లతూమూడే దగ్గర ప్రయాణిస్తుండగా మందుపాతర పేలిందని అధికారులు, ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.ఈ జవాన్లలో చాలామంది సెలవులు ముగించుకుని తిరిగి విధుల్లో చేరేందుకు కశ్మీర్ వచ్చిన వాళ్లే.300 కిలోమీటర్ల పొడవుండే ఈ వ్యూహాత్మక రహదారిని పారామిలిటరీ దళాలు, సైన్యం నిరంతరం గస్తీ కాస్తుంటుంది.గాయపడిన జవాన్లను శ్రీనగర్‌లోని 92- బేస్ ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు. మందుపాతర పేలిన తర్వాత బిజీగా ఉండే ఈ హైవేపై రాకపోకలు నిలిపివేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.దాడి జరిగిన సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న రెండు బస్సులకు ముందు వెనుక రెండు సెక్యూరిటీ వాహనాలు కూడా వెళ్తున్నాయి.ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత మిలిటెంట్ గ్రూప్ జైషే మహమ్మద్ ప్రకటించింది.దాడి జరిగిన వెంటనే ఒక ప్రకటన విడుదల చేసిన జేఈఎం ప్రతినిధి ముహమ్మద్ హసన్ తమ బృందంలోని పుల్వామాకు చెదిన డ్రైవర్ అదిల్ అహ్మద్ అలియాస్ వకాస్ కమాండో ఈ దాడి చేశాడని తెలిపారు.మరో వైపు ముష్కరుల దాడిని యావత్ ప్రజలు ఖండించారు. దేశ నాయకులతో ప్రజలు అమరులైన జవాన్ లకు నివాళులు అర్పించారు..మరోవైపు జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. జవాన్ల త్యాగం వృథా కాదని ట్విట్టర్లో పేర్కొన్నారు. అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని తెలిపారు.

ముష్కరుల దాడి.. అమరులైన జవాన్లు
Narendra Modi
Pulwama
CRPF
jammu kashmir