ముఖ్యమంత్రి ఆహ్వానిస్తే తెరాసలో చేరుతా

సినీ నటుడు సుమన్‌ వెల్లడి 
గౌడ జాతికి కేసీఆర్‌ చేసిన మేలు మరువలేనిదని వ్యాఖ్య 

భువనగిరి టౌన్‌, న్యూస్‌టుడే: రాజకీయంగా ఇంకా నిర్ణయం తీసుకోలేదని..కేసీఆర్‌ ఆహ్వానిస్తే తెరాసలో చేరుతానని సినీనటుడు సుమన్‌ అన్నారు. శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌడ జాతికి కేసీఆర్‌ చేసిన మేలు మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన తమ జాతికి చేసిన సహాయానికి పాదాభివందనం చేస్తున్నానన్నారు. గీత కార్మికుల సంక్షేమానికి ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలు తీసుకున్నందున.. జాతి మొత్తం ఆయనకు అండగా నిలిచి రుణం తీర్చుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ తన నుంచి ఎలాంటి సహాయం పొందాలనుకున్నా.. చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమా రంగంలో బీజీగా ఉన్నానని, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, తమిళ సినిమాలు చేస్తున్నానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *