‘మిర్యాల’ పెద్దాయన…. గంగాధర్ ఇక లేరు

అక్షిత ప్రతినిధి, మిర్యాలగూడ :  ‘మిర్యాల’ పెద్దాయనగా పేరొందిన రాజకీయ ఉద్దండుడు తిరునగర్ గంగాధర్ ఇక లేరు.
రాజకీయ కురువృద్ధుడు, స్వాతంత్ర్య సమరయోధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరునగర్ గంగాధర్ హైదరాబాద్ లోని అనారోగ్యంతో సన్ సైన్ ఆసుపత్రిలో గత పదిహేను రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. రాజకీయ సుదీర్ఘ చరిత్ర కలిగి కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు పొందిన నాయకుల్లో ఒకరు.1971 నుండి 1979 మార్చి నెల మాసం వరకు మిర్యాలగూడ మున్సిపాలిటీ ఏర్పాటు కానంత వరకు గ్రామపంచాయతీ సర్పంచ్ గా వ్యవహరించారు. 1995 సంవత్సరం కాలంలో మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ గా ప్రత్యక్ష ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గార్లపాటి నిరంజన్ రెడ్డిపై పోటీ అతిస్వల్ప వేయి లోపు ఓట్లతో ఓడిపోయారు… 1996 సంవత్సరంలో నల్గొండ పార్లమెంటు సభ్యునిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీ తో ఓడిపోయారు..2007 సంవత్సరం చివరిమాసంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా సంవత్సరంన్నర కాలం బాధ్యతలు నిర్వహించి 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా మిర్యాలగూడ ఎమ్మెల్యేకు పోటీ చేసి స్వల్ప మెజారిటీ 2 వేల ఓట్లతో ఓడిపోయారు.. మిర్యాలగూడ నియోజకవర్గoలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు.. ఆర్యవైశ్య సామాజిక వర్గoలో మంచి ప్రాధాన్యత గలిగిన వ్యక్తిగా ఉండి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపును పొందడమే కాకుండా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో మంచి సంబంధాలు కొనసాగించారు…మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ కమిటీకీ అధ్యక్షుడిగా ఒక ధప ఉన్నారు..తన రాజకీయ జీవిత చరిత్రలో యాభై సంవత్సరం కాలంలో రెండు దఫాలు తప్ప నలభై ఏళ్లు మిర్యాలగూడ పట్టణంకు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారు…బలమైన ప్రత్యర్థిగా కమ్యూనిస్టు
పార్టీతో పోరాటం సాగించారు…స్వర్గీయ సర్ధార్ చకిలం శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితంగా ప్రధాన అనుచరునిగా ఉండి పేద బడుగు, బలహీన వర్గాలకు పెద్ద దిక్కుగా ఉండి నమ్మిన వాళ్లకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు…స్వర్గీయ సర్ధార్ చకిలం శ్రీనివాస రావు మిర్యాలగూడ ఎమ్మెల్యే గా 1983 నుండి 85 వరకు ఉన్న కాలంలో చకిలం శ్రీనివాస రావు గంగాధర్ నివాసం నుండే పార్టీ కార్యక్రమలు, ప్రజలకు సేవకేంద్రంగా వాడుకునేవారు..మిర్యాలగూడలో కార్మికుల సమస్యల కొరకు ఐయన్ టి యుసిని బలోపేతం చేసి కార్మికుల సమస్యల కోసం కృషి చేశారు… వారి మరణం పట్ల జిల్లా,నియోజకవర్గ ,పట్టణ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

 

 

tags : tirunagar gangadhar, cong, sr.leader

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *