మా కొద్దీ… రేషనలైజేషన్ : జెఏసి చైర్మన్ డాక్టర్ రమేష్

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : వైద్యసిబ్బందిపై గుదిబండగా పరిణమించిన రేషనలైజేషన్ మాకొద్దని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ బరిగెల రమేష్ అన్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో యోచనలో ఉన్న రేషనలైజేషన్ ను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ తప్పనిసరయితే విధివిధానాలపై జేఏసీ ప్రతినిధులతో చర్చించాకే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని, లేనిపక్షంలో జెఏసి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రణాళికతో ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, సిబ్బందితో సమ్మిళితమై52 సంఘాలతో రూపుదిద్దుకున్న జాయింట్ యాక్షన్ కమిటీ బృందం పలు అంశాలపై సమీక్షించి…అందుకు అవసరమైన కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయా అంశాలతో కూడిన నివేదికను జేఏసీ చైర్మన్ డాక్టర్ రమేష్, సెక్రెటరీ జనరల్ బి.వెంకటేశ్వర రెడ్డి, కన్వీనర్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, కో ఆర్డినేటర్ డాక్టర్ నరహరి, సలహాదారు జూపల్లి రాజేందర్ లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి కి అందజేశారు. ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలకు ఉపక్రమించాలని వారు కోరారు. అర్హత కల్గిన ఉద్యోగులు, సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని క్రమబద్దీకరించాలని, సమాన పనికి… సమాన వేతనాలు మంజూరు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై ఉద్యమానికి సన్నద్ధమౌతున్నట్లు హెచ్చరించారు.

 

 

 

 

 

tags : Medical & Health, Unions, jac,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *