మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్‌ !

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్‌ నిలవనుంది. నాందేడ్‌ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నాందేడ్‌లోని రాజకీయ పార్టీల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. గతంలో నాందేడ్‌ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని నేతలు ఉద్యమించారు.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తామని ఈ మేరకు తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా మహారాష్ట్రకు చెందిన పలువురు రైతులు సీఎం కేసీఆర్‌ను కోరారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా రైతులు మంగళవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలవుతున్నాయన్నారు. కాగా తమ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలోనూ తెలంగాణ తరహా పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేదంటే తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని కోరామన్నారు. ఇదే డిమాండ్‌తో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించారు. టీఆర్‌ఎస్ పార్టీ టికెట్లపై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. సీఎం స్పందిస్తూ.. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతుల కోరికను మహారాష్ట్ర ప్రభుత్వం మన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

 

tags : trs, maharastra, telangana, cm kcr

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *