మహాయజ్ఞంలా గులాబీ సభ్యత్వాలు

టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

క్రియాశీలక సభ్యత్వాలపై దృష్టిపెట్టాలి

పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ జిల్లా నాయకులు మధార్ బాబా పిలుపు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న సభ్యత్వాల నమోదు కార్యక్రమం మహా యజ్ఞంలా కొనసాగుతోందని టీఆర్ ఎస్ జిల్లా నాయకులు షేక్ మధార్ బాబా ఉద్ఘాటించారు. పార్టీ శ్రేణులంతా క్రియాశీలక సభ్యత్వాలపై దృష్టిపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని 47వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. పార్టీ కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలతోనే రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకూ నీరు అందుతున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు అధినాయకత్వం ఢీల్లీలో ఉంటుందని, కాని తమ పార్టీ అధినాయకత్వం ఇక్కడి ప్రజలేనన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి లక్ష సభ్యత్వాలను నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నాయకులు మతీన్, జీడీఆర్ జానీ, రుషిల నుంచి క్రియాశీలక సభ్యత్వాలను స్వీకరించిన అనంతరం మధార్ బాబా మాట్లాడారు. టీఆర్ఎస్ సభ్యత్వాల నమోదులో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. నిబద్ధత ఉన్న కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినప్పుడు అనేక మంది ఉద్యమకారులు టీఆర్ఎస్ కు అండగా నిలిచారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చిన్న మొక్కలా ప్రారంభమైన గులాబీ పార్టీ మహా వృక్షంలా మారిందని అన్నారు. కార్యకర్తలపై ఉన్న ప్రేమతో సభ్యత్వాల నమోదులో భాగంగా బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. సభ్యత్వాల నమోదు ప్రక్రియను చురుకుగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రెండేండ్ల కిందట రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల సభ్యత్వాలను నమోదు చేసుకున్న టీఆర్ఎస్ రాష్ట్రంలోనే అత్యంత బలమైన పార్టీగా ఆవిర్భవించిందని అన్నారు. ప్రతీ కార్యకర్త రూ.100 చెల్లించి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొందాలని కోరారు. అంతేగాకుండా, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతీ కార్యకర్త టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం పొందేలా చూడాలని అన్నారు. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొందిన కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేయన్నట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెల్లడించారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ప్రమాదవశాత్తూ మృతిచెందినట్టయితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేసి గులాబీ పార్టీ బాసటగా నిలుస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్నారని అన్నారు. అందుకే, యువత పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నారని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలెవరికైనా ఏ ఆపద వచ్చినా ఎమ్మెల్యే భాస్కర్ రావు పార్టీ తరఫున ఆదుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై అభిమానంతో రెండేండ్ల కిందట 65 వేల మంది నుంచి రికార్డు స్థాయిలో సభ్యత్వాలను నమోదు చేశామని అన్నారు. ఈ ఏడాది గత రికార్డులను బ్రేక్ చేసి అధిక సంఖ్యలో లక్ష్య సభ్యత్వాలను నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. 2001, ఏప్రిల్27న ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ గడిచిన 20 ఏండ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కార్యకర్తలను ఆదుకునే స్థాయికి ఎదిగిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలను పూర్తి చేసుకోనున్న సందర్భంగా ప్రతీ నియోజకవర్గం నుంచి 50 వేల సభ్యత్వాలను నమోదు చేయాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారని అన్నారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోందని అన్నారు. 32 జిల్లా పరిషత్ కార్యాలయాలపై గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయని అన్నారు. 130 మున్సిపాలిటీల్లో 122 కైవసం చేసుకున్నామని, 12,751 గ్రామ పంచాయతీల్లో 9500 స్థానాల్లో గెలుపొందామని అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ పని చేస్తున్నదన్నారు. త్యాగాల పునాధులపై ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు.ప్రతీ కార్యకర్త ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వాలను నమోదు చేయాలని కోరారు. ప్రతీ రోజు సభ్యత్వాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు. అంతేగాకుండా, గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను ప్రభుత్వం అందజేస్తున్నదని చైతన్యపర్చాలని కోరారు. ప్రతీ గ్రామంలో రైతులను విజ్ఞానవంతులుగా చేసేందుకు రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని చెప్పాలని కోరారు. పేదింటి అడబిడ్డల పెండ్లి కోసం కల్యాలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు. ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి మౌళికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తున్నదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆత్మ గౌరవం కోసం ఉద్భవించిన పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మతీన్, రుషి, జీడీఆర్ జానీ, షేక్ మునీర్, ఇమ్రాన్, గౌస్, వినోద్, జద్దు, రజియా, జమీల, జుబేద, మున్ని, జరీనా, షమా, ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *