మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాజీనామా

అక్షిత ప్రతినిధి, చెన్నై: మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీకే తహిల్మ్రణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపారు. మేఘాలయ హైకోర్టుకు తనను బదిలీ చేయాలని కోరగా.. ఆమె వినతిని మూడు రోజుల తర్వాత సుప్రీంకోర్టు కొలిజీయం తిరస్కరించింది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేసే కంటే ముందు.. తహిల్మ్రణి కోర్టు జడ్జిలకు విందు ఏర్పాటు చేశారు. తనను మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా ఆగస్టు 28వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని కొలిజీయంను రమణి కోరారు. ఆమె చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొలిజీయం తిరస్కరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *