మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ , అక్షిత ప్రతినిధి :
మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వాణీదేవి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాణీదేవి నామినేషన్ దాఖలు కంటే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి వాణీదేవి కూడా హాజరు కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.