మంత్రి కేటీఆర్‌ను కలిసిన అజారుద్దీన్

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్, ప్యానెల్ సభ్యులు ఇవాళ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. బుద్ధభవన్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు అజారుద్దీన్ తెలిపారు. నిన్న జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా జాన్ మనోజ్, కార్యదర్శిగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా నరేశ్, ట్రెజరర్‌గా సురేంద్ర కుమార్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ విజయం సాధించారు.

అంతా అజార్ ప్యానల్‌దే..

ఓ వైపు అధ్యక్ష బరిలో అజార్ దూసుకెళ్తుంటే.. అతడి ప్యానల్ కూడా జోరు కనబర్చింది. వైస్ ప్రెసిడెంట్ కోసం జరిగిన ఎన్నికల్లో జాన్ మనోజ్ 49 ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి దల్జీత్ సింగ్‌పై గెలుపొందాడు. మనోజ్‌కు 136 ఓట్లు రాగా.. దల్జీత్‌కు 87 ఓట్లు పడ్డాయి. కార్యదర్శిగా విజయానంద్ గెలిచాడు. విజయానంద్‌కు 137 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి వెంకటేశ్వరన్‌కు 62, మూడో అభ్యర్థి భాస్కర్‌కు 24 ఓట్లు వచ్చాయి. జాయింట్ సెక్రటరీగా 132 ఓట్లు సాధించిన నరేశ్ గెలుపొందగా.. కౌన్సిలర్‌గా అనురాధ ఎన్నికైంది. ట్రెజరర్‌గా సురేంద్ర కుమార్ అగర్వాల్ 141 ఓట్లు దక్కించుకొని విజయఢంకా మోగించాడు. అతడితో పోటీపడ్డ హనుమంత్ రెడ్డి (60 ఓట్లు), బాబురావు సాగర్ (22 ఓట్లు) చాలా దూరంలో నిలిచిపోయారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *