మండలి చైర్మన్ గుత్తా పూజలు

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్ : మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి పవిత్ర పుణ్య క్షేత్రాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు.శాసన మండలి చైర్మన్ హోదాలో మొదటి సారిగా ఆయన ఆలయానికి రావడంతో ఆలయ అర్చకులు ఆయన ను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించారు.ఆయనతో పాటు హుజూర్ నగర్ తెరాస ఇంచార్జ్ శానంపుడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు,ఆలయ ఈవో భాస్కర్ రావు, ఎంపీపీ పార్వతి కొండా నాయక్, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

 

 

 

tags : mattapally temple, gutha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *