భారీ రేటుకు ‘విశ్వాసం’ థియేట్రికల్ రైట్స్

అజిత్ – శివ క్రేజీ కాంబినేషన్
మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
సంక్రాంతికి విడుదల
అజిత్ తాజా చిత్రంగా ‘విశ్వాసం’ రూపొందింది. శివ దర్శకత్వంలో నిర్మితమైన ఈ సినిమాలో అజిత్ సరసన నయనతార నటించింది. అజిత్ – శివ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘వీరమ్’ .. ‘వేదాళమ్’ .. ‘వివేగం’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. దాంతో టైటిల్ విషయంలో అదే సెంటిమెంట్ ను అనుసరిస్తూ ఈ సినిమాకి ‘విశ్వాసం’ అనే పేరును పెట్టారు.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. ఈ కాంబినేషన్ కి గల క్రేజ్ కారణంగా తమిళనాడు థియేట్రికల్ హక్కుల కోసం గట్టిపోటీ ఏర్పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన కేజేఆర్ స్టూడియోస్ వారు ఈ హక్కులను సొంతం చేసుకున్నారు. అందుకోసం వాళ్లు 48 కోట్లను చెల్లించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం గురించే కోలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *