భారీ ఆర్థిక‌ సంస్క‌ర‌ణ‌లు

అక్షిత ప్రతినిధిహైదరాబాద్‌ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప‌న్ను వేధింపుల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఆమె స‌మాధానం ఇచ్చారు. ప‌న్ను ఎగ‌వేసిన వారిపై జ‌రిమానా విధిస్తున్నామ‌ని, కానీ వారిని కోర్టుకు ఈడ్చ‌డంలేద‌ని ఆమె అన్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గిస్తుంద‌ని వ‌స్తున్న ఊహాగానాల‌ను ఆమె కొట్టిపారేశారు. అన్ని ఐటీ నోటీసుల‌ను అక్టోబ‌ర్ ఒక‌ట‌వ తేదీలోగా క్లియ‌ర్ చేస్తామ‌న్నారు. ప‌న్ను వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పుల‌కు త‌మ ప్ర‌భుత్వ శ్రీకారం చుట్టింద‌న్నారు. సంప‌ద‌ను సృష్టించేవాళ్ల‌ను ప్రోత్స‌హిస్తామ‌న్నారు. ఐటీ ఎగ‌వేత‌ల‌పై ఎవ‌రెవ‌రికి స‌మ‌న్లు ఇస్తున్నామ‌న్న విష‌యాన్ని ఇక నుంచి సెంట్ర‌లైజ్ చేయ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు. స‌మ‌న్ల కోసం ఓ సెంట్ర‌లైజ్డ్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. 14వేల ట్యాక్స్‌ కేసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. ఫారిన్ పాల‌సీ ఇన్వెస్ట్‌మెంట్‌(ఎఫ్‌పీఐ)ల‌పై స‌ర్‌చార్జీల‌ను ఎత్తివేసిన‌ట్లు ఆమె చెప్పారు. ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌డాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేసిన‌ట్లు ఆమె తెలిపారు. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స‌బులిటీ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌కున్నా.. దాన్ని క్రిమిన‌ల్ కేసుగా ప‌రిగ‌ణించ‌బోమ‌న్నారు. వాటిని సివిల్ కేసులుగా ట్రీట్ చేయ‌నున్నారు. సూప‌ర్ రిచ్ ట్యాక్స్ నుంచి విదేశీ ఇన్వెస్ట‌ర్ల‌ను మిన‌హాయిస్తున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు. స్టార్ట్ అప్స్‌, ఇన్వెస్ట‌ర్ల‌పై విధిస్తున్న ఏంజిల్ ట్యాక్స్‌ను ఉప‌సంహ‌రించ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. 4 ల‌క్ష‌ల కోట్ల లిక్విడ్ క్యాష్‌ను మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. బ్యాంకుల‌కు సుమారు 70 వేల కోట్ల అద‌న‌పు నిధుల‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. రెపో రేటుకు అనుగుణంగా గృహ‌, వాహ‌న రుణాల‌పై భారం త‌గ్గ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

 

 

 

 

 

 

 

tags : nirmalaseetharaman, Central Finanance Minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *