మంచి నీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించిన సేఫ్ వాటర్ నెట్ వర్క్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని శంకరంపేట, పొడిచెన్ పల్లి, కోడెపాక గ్రామాల్లోని తక్కువ ఆదాయ కుటుంబాలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు మూడు నీటి శుద్ధి ప్లాంట్లను అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన స్వచ్ఛంద సంస్థ సేఫ్ వాటర్ నెట్ వర్క్ (ఎస్ డబ్ల్యూ ఎన్) నిర్మించింది. చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ టాగా మసాయుకి, సేఫ్ వాటర్ నెట్ వర్క్ కంట్రీ డైరెక్టర్ రవీంద్ర సేవక్ సమక్షంలో ఈ నీటి కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. జపాన్, భారతదేశం మధ్య స్నేహబంధం, సహకారానికి ఈ ప్రాజెక్టు చిహ్నంగా నిలుస్తుందని, ఆ సమాజాలు ఆరోగ్యకరంగా, సంతోషంగా జీవిస్తాయని ఆశిస్తున్నానని అన్నారు చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ టాగా మసాయికి. సమాజంలోని ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ వారు ఆరోగ్యకరంగా జీవించేలా చూడాలన్న మా నిబద్ధతకు ఈ కార్యక్రమం ఒక ఉదాహరణ అన్నారు. సేఫ్ వాటర్ నెట్ వర్క్ కంట్రీ డైరెక్టర్ రవీంద్ర సేవక్ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఇతర అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.