భారత్‌ చేతికి రాఫెల్‌.. రాజ్‌నాథ్‌

పారీస్‌ :  భారత వైమానికదళం అమ్ములపొదిలో మరో అత్యంత ముఖ్యమైన అస్త్రం చేరింది. ఫ్రాన్స్‌ దేశం తయారు చేసిన రఫేల్‌ యుద్ధవిమానం ఇవాళ భారత్‌కు అందింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రన్‌ చేతుల మీదుగా భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రాఫెల్‌ అందుకున్నారు. డసోల్ట్‌ ఏవియేషన్‌ తయారీ కేంద్రంలో రాజ్‌నాథ్‌ తొలి రఫేల్‌ను స్వీకరించారు. అనంతరం విమానానికి రాజ్‌నాథ్‌ దసరా పండుగను పురస్కరించుకొని ఆయుధపూజ నిర్వహించారు. బోర్డియాక్స్‌లో రఫేల్‌ యుద్ధవిమాన స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ..’అనుకున్న సమయానికి రాఫేల్‌ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాఫేల్‌ రాకతో భారత వాయుసేన మరింత బలోపేతం అవుతుంది. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం అన్ని రంగాల్లో మరింత పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇవాళ భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయం. రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇవాళ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారత్‌లో దసరా పండుగ(విజయదశమి) జరుపుకుంటామని, 87వ ఎయిర్‌ఫోర్స్‌ డే కూడా ఇవాళేనని’ రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.  అంతకుముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రన్‌తోనూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ భేటీ అయ్యారు. రెండు దేశాల రక్షణ, వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై చర్చించారు. భారత్‌, ఫ్రాన్స్‌ బలమైన ద్వైపాక్షిక బంధాన్ని ఈ భేటీ చాటిందని రక్షణ శాఖ పేర్కొంది. బోర్డియాక్స్‌లో రఫేల్‌ యుద్ధ విమాన తయారీ కేంద్రాన్ని రాజ్‌నాథ్‌ పరిశీలించారు.

 

tags : paris, rafel, rajnadhsing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *