సంగారెడ్డి, అక్షిత ప్రతినిధి : సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చేరు నియోజకవర్గంలో గల భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ఈ ఎస్ ఐ రోడ్డు లో గురువారం రోజు హరితహారం నిర్వహించగా ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, పటాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిలు హాజరై 108 మొక్కలు నాటారు. అనంతరం రామచంద్రాపురంలోని గీత భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి తన సొంత నిధులతో అభివృద్ధి చేసిన విషయంలో ఎమ్మెల్సీ ని కలెక్టర్ అభినందించారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా అభివృద్ధి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ సంజయ్య యాదవ్, పుష్ప నాగేష్ యాదవ్, కుమార్ గౌడ్, పరమేష్ యాదవ్, దేవేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.
tags : sangareddy, harithaharam, collector