భలే ఉంది మీ తీరు.. పలకరిస్తే నన్నంటారా?: చంద్రబాబుపై పవన్ ఫైర్

భలే ఉంది మీ తీరు.. పలకరిస్తే నన్నంటారా?: చంద్రబాబుపై పవన్ ఫైర్

  • జగన్‌పై దాడి అమానుషమన్న పవన్
  • తప్పుబట్టిన చంద్రబాబు
  • విరుచుకుపడిన జనసేన అధినేత

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన దాడిపై జనసేన అధినేత పవన్ స్పందించారు. దాడిని ఖండించిన పవన్.. అమానుషమని పేర్కొన్నారు. గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పవన్, కేసీఆర్, కేటీఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులపై విరుచుకుపడ్డారు.

తిత్లీ తుపానుతో శ్రీకాకుళం అతలాకుతలమైతే ఒక్క మాటా మాట్లాడని వీరంతా జగన్‌కు చిన్న గాయం తగలగానే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనక ఏదో కుట్ర కోణం కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. జగన్‌పై దాడిని ఖండించినందుకు తనను విమర్శించడమేంటని ప్రశ్నించారు. ఏదో సామెత చెప్పినట్టు ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి, ఆయన వర్గం తమ మీద పడి ఏడవడానికి రెడీగా ఉంటారని పవన్ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *