సాగర్ సందర్శించిన ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
అక్షిత ప్రతినిధి , నాగార్జున సాగర్ :నాగార్జున సాగర్ ను ఆదివారం నాడు ఎస్సీఎస్ టి కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సభ్యులు రామ్ పాల్ నాయక్, లీలావతి, విద్యాసాగర్ లతో కలిసి సందర్శించారు. విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న ఈ బృందానికి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, అసిస్టెంట్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వెంకటయ్య, అసిస్టెంట్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వెంకట కృష్ణ, తిరుమలగిరి ఎంపీపీ భగవాన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు బుద్ధవనం ప్రాజెక్టు చేరుకొని బుద్ధుని పాదాలవద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం మహాస్తూపాన్ని, ధ్యానవనం ,స్తూప వనం సందర్శించి బుద్ధ వనం లో మొక్కలు నాటారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో బౌద్ధం ప్రపంచానికి శాంతికి ప్రతీకగా గా నిలుస్తుందని బుద్ధుని బోధనలు అందరూ పాటించాల్సిన అవసరం ఉందన్నారు .ఇటువంటి ప్రశాంతమైన బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించిన అందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు .అనంతరం మీరు నాగార్జునసాగర్ ప్రధాన డ్యాము, ప్రధాన జలవిద్యుత్ కేంద్రాన్నిసందర్శించారు .వీరితో పాటుస్థానిక ఎస్ఐ నరసింహారావు బుద్ధవనం ప్రాజెక్టు డిజైన్ ఇన్చార్జ్ శ్యాంసుందర్ , ఏ ఈ జగదీష్ , టూరిజం గైడ్ సత్యనారాయణ ,పార్థసారథి ,జైపాల్, బాలకృష్ణ ,జానీ పాషా, రమేష్ ,శ్రీను, బాలాజీ తదితరులు ఉన్నారు.
