బీజేపి అబద్ధాలను పటాపంచలు చేయాలి

కార్యకర్తలే టీఆర్ఎస్‌ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం ఎమ్మెల్సీ క‌విత‌

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

టీఆర్ఎస్ పార్టీ బ‌లం కార్య‌క‌ర్త‌లేన‌ని ఎన్నారైల సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల శ‌నివారం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, ఎన్నారై సలహాదారు కల్వకుంట్ల కవిత హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కవిత మాట్లాడుతూ.. విదేశాల్లో ఇటీవ‌ల ప్ర‌మాదాల్లో చ‌నిపోయిన టీఆర్ఎస్ ఎన్నారై కార్య‌క‌ర్త‌ల మృతికి నివాళ‌ర్పించారు. బాధిత కుటుంబ స‌భ్య‌ల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పట్టభద్రుల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, సుర‌భి వాణీ దేవిని గెలిపించాల్సిందిగా కోరారు. మన బాధ్యతగా వీరిరువురికి ఓటేయాల్సిందిగా మనకు తెలిసిన వాళ్ళను, పరిచయస్తులని కోరాలన్నారు. బీజేపీ చేస్తున్న అబద్ధాలని పటాపంచలు చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని రకాలుగా సాక్షాలతో సహా తిప్పి కొడుతున్నార‌న్నారు. ఈ ఐదు రోజులు గట్టిగా ప్రచారం చేసి గెలుపుకు కృషి చెయ్యాలని కోరారు.

మహేష్ బిగాల మాట్లాడుతూ.. న్యూజెర్సీలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతినిధి దేవేందర్ రెడ్డి నల్లమడ, ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా జాయింట్ సెక్రటరీ రమణ రెడ్డి కంకనల, ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా వైస్‌ ప్రెసిడెంట్ సత్యం గురిజపల్లియం మృతికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, వాణీదేవిని గెలుపులో ఎన్నారైల పాత్ర‌ ఉండాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రములో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా టీఆర్ఎస్ ప్రతినిధులు అనిల్ కూర్మాచలం, కాసర్ల నాగేందర్, విజయ్ కోసిన, జగన్ వాడ్నలా, శామ్ బాబు ఆకుల, జువ్వాడి శ్రీనివాస్, అశోక్ దుసారి, నాగరాజు గుర్రాల, మహిపాల్ రెడ్డి, సతీష్ రాధారపు, కోమాండ్ల కృష్ణ , శ్రీధర్ అబ్బగోయిన‌, టోనీ జన్ను, అరవింద్ గుంత శ్రీధర్, చిట్టి బాబు, వెంగల్ జలగం, రాజేష్ మాదిరెడ్డి, నవీన్, అభిలాష, సుధీర్ జలగం, అహ్మద్ షేక్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *