బిజెపి నేత మురళీ మనోహర్ జోషికి అస్వస్థత

లక్నో :  బిజెపి అగ్రనేత మురళీ మనోహర్ జోషి అస్వస్థతకు గురయ్యారు. కాన్పూర్ లోని తన నివాసంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం అస్వస్థతకు గురి కావడంతో రీజెన్సీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. బిజెపిలో ఉన్న వయో నిబంధన కారణంగా ఆయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. బిజెపి వ్యవస్థాపకుల్లో జోషి ఒకరన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన బిజెపి అధ్యక్షుడిగా కూడా పని చేశారు. జోషి అనారోగ్యానికి గురికావడంతో బిజెపి శ్రేణులు, ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. జోషి త్వరగా కోలుకోవాలని బిజెపి శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.

 

 

 

tags : muralimanoharjoshi, bjp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *