బిగ్‌బాస్‌లోకి ‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌’

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌: రియాలిటీ షో బిగ్‌బాస్3లో ఈ వారం గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు హోస్ట్ నాగార్జున‌. త‌న‌దైన స్టైల్లో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్ తేజ్ బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌తో క‌లిసి సంద‌డి చేశారు. దానికి సంబంధించిన ప్రొమో విడుద‌లైంది. ఈ ప్రొమో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ప్రొమోను గ‌మ‌నిస్తే శ్రీముఖి, హిమ‌జ‌, పున‌ర్న‌వి వ‌రుణ్‌తేజ్‌కి ప్ర‌పోజ్ చేశారు.

శ్రీముఖి ప్ర‌పోజ్ చేసిన‌ప్పుడు అంద‌రూ చూస్తున్నారంటూ స‌ర‌దా స‌మాధానాన్ని చెప్పిన వ‌రుణ్‌తేజ్‌.. `నేను ప్ర‌పోజ్ చేయాలంటే చేతులు వ‌ణుకుతున్నాయి` అని పున‌ర్న‌వి చెప్ప‌గానే `ఆ అమ్మాయి నాకు చెప్ప‌లేక‌పోతోందంటే ఇంకెక్క‌డో చెప్పింది సార్‌` అని వ‌రుణ్ తేజ్ స‌మాధానం చెప్ప‌డంతో బిగ్ హౌస్‌లో న‌వ్వులు విరిశాయి.

`చూస్తున్నాడు షో ని` అంటూ వ‌రుణ్‌ని ఉద్దేశించి నాగార్జున చెప్పాడు. `నీ ల‌గ్గ‌మెప్పుడు..దావ‌త్ ఎప్పుడో చెప్పాలి మ‌రి` అని శివ‌జ్యోతి అడ‌గ్గానే `హౌస్ నుండి బ‌య‌ట‌కు రాగానే మ‌స్త్ దావ‌త్ ఇస్తా మీ అంద‌రికీ` అని వ‌రుణ్ స‌మాధానం ఇచ్చాడు. మ‌రి గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ మొత్తం సంద‌డంతా చూడాలంటే ఈరోజు షో చూడాల్సిందే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *