బిఎల్ ఆర్ సేవలతో.. కాంగ్రెస్ పటిష్టత

1200 మంది ఆటో డ్రైవర్లకు ఆసరా
పేదల హృదయాల్లో బిఎల్ ఆర్ చెరగని ముద్ర
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ ఆర్) సేవలతో కాంగ్రెస్ మరింత పటిష్టతకు ఉపయుక్తంగా ఉంటుందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని వై జంక్షన్ సమీపంలోని రెడ్డి హోటల్ వద్ద బిఎల్ ఆర్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు బిఎల్ ఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి యేడాదిన్నర కాలంగా దేశాన్ని, రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తరుణంలో ప్రజలకు ప్రభుత్వాలు ఆసరాగా నిలువాల్సి ఉండగా అరకొరతో చేతులు దులుపు కుంటుండగా స్వచoద సంస్థలు పేదలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ ఆర్ పేద ప్రజలకు కొండంత అండగా నిలిచేందుకు ప్రభుత్వానికి ధీటుగా మిర్యాలగూడ నియోజక వర్గంలో సేవలు అందిస్తున్నారన్నారు. కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెస్టులు, వ్యాక్సిన్ ను ముమ్మరం చేయాలని, వైద్య సదుపాయాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రతి పేదవాడికి ఆసరాగా నిలిచేందుకు స్వంత నిధులతో ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టి… పేదల హృదయాల్లో బిఎల్ ఆర్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఇప్పటికే కోవిడ్ బారిన పడిన కుటుంబాలకు పౌష్ఠిక ఆహారం అందించి… లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు 1200 మందికి బియ్యం, నిత్యావసర సరుకులు అందించడం బిఎల్ ఆర్ సేవా నిరతికి దర్పణమన్నారు. డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ బిఎల్ ఆర్ ప్రతి పేద ఇంటి ఆడపిల్ల పెళ్ళికి శ్రీ శ్రీనివాస కళ్యాణం శుభమస్తు పెళ్లి కానుక, కరోనాతో ఇంటి వద్ద నుండి ఉపాధి కోల్పోయిన పేదలకు కరోనా కిట్టు అందించుకుంటూ ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందించడం బి ఎల్ ఆర్ నిలువెత్తు హృదయానికి నిదర్శనమన్నారు. మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు, మతాలకు కులాలకు అతీతంగా పేదలకు ఆపద కాలంలో అండగా నిలిచేందుకు చేపడుతున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా ఉండేందుకు తమ పథకాలు దోహద పడతాయన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, పిసిసి మెంబర్ చిరుమర్రి కృష్ణయ్య, పొదిల శ్రీనివాస్, చిలుకూరి బాలు, జగ్గారెడ్డి, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, గంధం రామకృష్ణ, క్రికెటర్ జానీ, బండి యాదగిరి రెడ్డి, కొమ్మన నాగలక్ష్మి , లావురి రవినాయక్, రుణాల్ రెడ్డి, రామలింగయ్య, బసవయ్య గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజార్, గాజుల శ్రీనివాస్, పోలగాని వెంకటేష్, మెరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *