బాధిత చెంచు కుటుంబాలకు చేయూత

భాదిత చెంచు కుటుంబాలకు
ఎస్.వి.కె, సిపిఎం అధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
చనిపొయిన వారికి 10.లక్షలు ఎక్స్ గ్రే షియా ఇవ్వాలి.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యలు జాన్ వెస్లీ.

అచ్చంపేట, అక్షిత న్యూస్ :

అటవీ ఉత్పత్తులు సేకరించటానికి వెళ్ళి అడవిలో అకస్మాత్తుగా ఏర్పడిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు చెంచు కుటుంబాలకు ప్రభుత్వం భాదితులకు రూ. 10.లక్షలు చొప్పున , తీవ్ర గాయలైన వారికి 5.చొప్పున ఎక్స్ గ్రే షియా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యలు జాన్ వెస్లీ డిమాండ్‌ చేశారు. బుధవారం మల్లాపూర్ చెంచు పెంటలొ భాదికుటుంబాలను సిపిఎం పార్టీ, గిరిజన సంఘం, ప్రజా సంఘాల అధ్వర్యంలో పరామర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్.వి.కె,) సిపిఎం అధ్వర్యంలో నిత్యావసర సరుకులు ,రగ్గులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ… చెంచుల పట్ల ప్రభుత్వం వివక్ష త చూపుతుందని, చెంచుల కోసం కేటాయించిన బడ్జెట్ వారి కోసమే ఖర్చు చెస్తె..చెంచుల జీవితాలు మారుతాయని అన్నారు. చెంచుల పేరు తొ వారికి కేటాయించిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. చెంచుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటిడిఏ ఉత్సవ విగ్రహాం లా ఉందన్నారు. అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయలైన చెంచులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం పాలకులు పూర్తిగ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. అడవిలో మంటలకు ముగ్గురు చెంచులు చనియారు. మరో 8 మంది తీవ్ర గాయలైన ప్రభుత్వం వైద్యం ఖర్చులకు కొంత నగదు ఇచ్చి చెతులు దులుపుకుందన్నారు. అటవీ ఉత్పత్తులు అంతరించి పోతున్నాయి.. ఉపాది లేదు, త్రాగు నీరు లేదు. కలుషితమైన చెలిమ నీరు త్రాగుతున్నారు. కనీస వసతులు లేక చెంచులు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాదిత కుటుంబాలకు అర్థిక సహాయం అందించిక పొతే చెంచులను సమీకరించి, ప్రజాసంఘాల సిపిఎం పార్టీ అధ్వర్యంలో ఆందొళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు , అప్పాపుర్ సర్పంచ్ బాల గురవయ్య, జిల్లా నాయకులు తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్.దెశ్యానాయక్ , జిల్లా కార్యదర్శి యం.శంకర్ నాయక్ , గోపాల్, ఏం పర్వతాలు, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సుల్తాన్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి కృష్ణ ప్రసాద్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *