బహుజనులకు స్ఫూర్తి… ఛత్రపతి శివాజీ

నేడు శివాజీ జయంతి

ఛత్రపతి శివాజీ బహుజనులకు స్పూర్తి… బాల్యం నుంచే విలువిద్యల్లో నేర్పరి. పదిహేనేళ్ల ప్రాయంలోనే స్వాతంత్ర్య రాజ్య కాంక్ష కల్గి ఉండి… ఆ దిశలో అడుగులు వేసి మరాఠా సామ్రాజ్యాన్నినిర్మించి… ఛత్రపతి శివాజీ చరిత్ర సృష్టించాడు.

శివాజీ భోంస్లే వంశానికి చెందిన వాడు. క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19వ తారీఖున జన్మించారు.. తల్లి జిజియాబాయి. తండ్రి శాహాజీ భోంస్లే. శివాజీ చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. స్వాతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలనే ఆకాంక్షను 1645 లో వ్యక్తీకరించాడు. దాదాజీ నరస ప్రభువుకు రాసిన ఉత్తరంలో హైందవ రాజ్య భావనను వ్యక్తీకరించాడని చరిత్రకారులు తెలుపుతున్నారు. దక్కన్ సుల్తానులు, మొఘల్ సామ్రాట్ లకు భిన్నంగా రాజ్యం ఏర్పాటు చేయాలని శివాజీ అనుకున్నాడు. పదహారేళ్ల వయస్సులో తోర్నా కోటను ఆక్రమించాలని ప్రయత్నించాడు. కొద్దికాలం తర్వాత తండ్రి మరణించాడు. అప్పట్నించి శివాజీ తన దండయాత్రను కొనసాగించాడు. అది 1664లో మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసే వరకు కొనసాగింది. 1674, జూన్ 16 రోజున ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగింది… శివాజీ మహారాజ్ మీద బ్రాహ్మణుల కోపానికి కారణం ఏమిటి? శివాజీ శూద్రుడు కావటమే కారణం. బ్రాహ్మణులు దక్కనీ సుల్తానులను, మొఘల్ పాలననైనా సహిస్తారు కానీ శూద్రుల రాజ్యాన్ని ఒప్పుకోరు. శూద్రులు పాలించే చోట బ్రాహ్మణులు వుండరాదని మనుధర్మం ఆదేశిస్తుంది. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాల్లో ఇతర ప్రాంతల్లోను బ్రాహ్మణులు అధిక సంఖ్యలో వున్నారు. వీళ్లు శివాజీ కులం కారణంగా అక్కడి ప్రాంతాన్ని విడిచి వెళ్లాలి. లేదా శివాజీకి లోబడి జీవించాలి. అందుకే, శివాజీని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. బిజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాతో దగ్గరకి శివాజీని అంతం చేయాలని కోరారు. ఆదిల్ షాతో సంప్రదింపులు జరపడానికి కృష్ణ బాస్కర్ కులకర్ణి బ్రాహ్మణుల తరుపున వెళ్ళాడు. ఎంతో బతిమాలితే ఆదిల్ షా శివాజీని అంతం చేసేందుకు ఒప్పుకుని అప్జల్ ఖాన్ అనే సేనా నేతృత్వంలో 1659లో సైన్యాన్ని పంపాడు… అప్జల్ ఖాన్ శివాజీని ప్రతాప్ గఢ్ కోట నుండి బయటకు రప్పించాడనికి చాలా ప్రయత్నాలు చేశాడు. గ్రామాల మీద దాడులు చేయించాడు. ప్రజలపై దాడులు చేయించాడు. ఈ దాడులకు బ్రాహ్మణ వర్గం పూర్తిగా సహకరించింది. శివాజీ ఈ చర్యలన్ని గమనించి తన సైన్యంతో వచ్చి ఆదిల్ షాని, అప్జల్ ఖాన్ ని యుద్ధంలో చూపేశాడు. తర్వాత నాపై హత్యాయత్నం ఎవరు చేయించి ఉంటారు అని ఆలోచిస్తూ వుండగా ఇదంతా చేసింది కృష్ణ బాస్కర్ కులకర్ణి అని తెలుసుకుంటాడు. ఇంత పని కృష్ణభాస్కర్ కులకర్ణి ఎందుకు చేశాడంటే శివాజీ బ్రాహ్మణ రాజ్యం కాకుండా బహుజన రాజ్యాన్ని నిర్మించాడు కనుక… శివాజీకి కులం, మతం అనే పట్టింపులు లేవు… ఆయన సైన్యంలో అన్ని మతాల, కులాల వారు ఉన్నారు. ఆయుధం పట్టే హక్కును శూద్రులు, అతిశూద్రులకు మనువు నిషేధించాడు. శివాజీ ఆయుధం పట్టే హక్కునే కాదు, రాజ్యంలో కీలక పదవులు కూడా కట్టబెట్టాడు. శూద్ర రైతాంగాన్ని దోచుకొనే పట్వారీ, కర్ణాలకు కఠిన శిక్షలు విధించాడు. రైతాంగానికి నూతన సాగు పద్ధతులు నేర్పాడు. పంటలను దాచుకోవటానికి గిడ్డంగులు ఏర్పాటు చేయించాడు. అతిశూద్రులకు భూమి మీద హక్కులు కల్పించాడు. మహర్, చమార్, మాంగ్, మాతంగ్, కులస్తులకి సైన్యంలో పదవులు ఇచ్చాడు. ఆత్మగౌరవం, అధికారం ఇవ్వటం వల్ల అంటరాని ప్రజలస్థితి మారిపోయింది. ఆ తర్వాత బ్రాహ్మణులు ఔరంగజేబుతో చేతులు కలిపి శివాజీ నివసిస్తున్న కోటలోని ఒక స్త్రీతో.. ఆమె కొడుకు రాజారాంకు రాజ్యం ఇస్తామని ఆశ చూపి, శివాజీ తినే అన్నంలో విష ప్రయోగం చేయించి తీవ్ర అనారోగ్యంతో శివాజీ మరణించేలా చేశారు … ఇక ఆ తర్వాత శివాజీ కుమారుడు శంభాజీని కూడా చంపేశారు. అలా వరసగా శివాజీ వారసులను అనేక ప్రయోగాల ద్వారా హతమార్చి చివరికి పీష్వాలు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. శూద్ర అతిశూద్రులకు తిరిగి హక్కులు కల్పించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ పౌరుషాన్ని ప్రతి బహుజనుడూ అందిపుచ్చుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *