అక్షిత బ్యూరో, సూర్యాపేట : సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు సందర్భంగా బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గన్న చంద్రశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ ధర్మభిక్షం భవన్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ యాత్ర నేరేడుచర్ల గరిడేపల్లి హుజూర్నగర్ బహిరంగ సభ జరుగుతుందని 13వ తారీఖున చిలుకూరు కోదాడ శాంతినగర్ నుండి ఖమ్మం జిల్లాకు లోకి వెళ్తుందని తెలిపారు. ఈనెల 17వ తారీఖున హైదరాబాదులో జరుగు బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు కార్మికులు కర్షకులు విద్యార్థి సంఘాల నాయకులు సూర్యాపేట జిల్లా కేంద్రానికి బయల్దేరుతున్న ట్లు తెలిపారు. అలాగే కామ్రేడ్ ధర్మభిక్షంకి పూలమాల వేసి నివాళులర్పించి బయలుదేరుతున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దొరేపల్లి శంకర్, అనంతుల మల్లేశ్వరి, పట్టణ నాయకులు చామల అశోక్ బొమ్మగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.
tags : cpi, ganna Chendrashekar, srpt