న్యూఢిల్లీ, అక్షిత ప్రతినిధి: వాస్తవాధీన రేఖ దగ్గర పాంగాంగ్ సరస్సుకు ఇరువైపులా ఇండియా, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. శనివారం రెండు దేశాల సీనియర్ కమాండర్ల స్థాయి పదో రౌండర్ చర్చలు జరగనున్నాయి. గత వారం రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తొలి దశ బలగాల ఉపసంహరణ పూర్తయింది. ఇందులో భాగంగా 150 చైనా యుద్ధ ట్యాంకులు, 5 వేల మంది చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు వెనక్కి వెళ్లిపోయారు. గతంలోనే ఈ బలగాల ఉపసంహరణకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన విషయం తెలిసిందే.