ప్రాణాలు తెగించి… సేవలు

ప్రంట్ లైన్ వారియర్స్ సేవలు విశిష్టo
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, అక్షిత ప్రతినిధి :

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పని చేస్తున్న వైద్య సిబ్బందికి కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో హోప్స్ అండ్ స్మైల్ ఫర్ చిల్డ్రన్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ లు, ఫేస్ షీల్డ్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సేవలు చాలా గొప్పవని అన్నారు. కుటుంబ సభ్యుల్లాగా వైద్య,ఆరోగ్య శాఖలోని సిబ్బంది సేవలు అందిస్తున్నారని అన్నారు. వారి రుణం తీర్చుకోలేమని అన్నారు. ఆరోగ్య సిబ్బందికి సేవలందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర పుల్లారెడ్డి, కోదాడ ఆస్పపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రజిని, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డి.హెచ్ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, వైద్యులు డాక్టర్ సూరజ్, సుధీర్, విజయ్, తేజ, లక్ష్మీప్రసన్న స్టాఫ్ నర్సులు, శానిటేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *