ప్రాణం పోయినా క్షమాపణ చెప్పను : రాహుల్‌

ఢిల్లీ, అక్షిత ప్రతినిధి  : ప్రాణం పోయినా క్షమాపణ చెప్పను. మోదీ, అమిత్‌షాయే జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ గాంధీ ఇది మేకిన్‌ ఇండియా కాదు.. రేప్‌ ఇన్‌ ఇండియా అన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంట్‌ సమావేశాల్లో సైతం ఆ పార్టీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తూ రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ నేడు భారత్‌ బచావో ర్యాలీని చేపట్టింది. బీజేపీ విభజన, విధ్వంసకర విధానాలకు వ్యతిరేకంగా సభను నిర్వహించింది. ఈ భారీ బహిరంగ సభకు ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మన్మోహన్‌ సింగ్‌, చిదంబరం, పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ స్వయంగా ధ్వంసం చేశారన్నారు. దేశం కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలో ఉల్లి ధర రూ.200కు పెరిగింది. తన పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదని.. రాహుల్‌ గాంధీ అని అన్నారు. తాను క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోందన్నారు. నిజం మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాల్నా అని ఆయన ప్రశ్నించారు. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం బాగుపపడుతుందన్నారు. మోదీ పాలనలో దేశవ్యాప్త రైతులంతా నిస్పృహలో ఉన్నారన్నారు. మోదీ పేదల నుంచి లాక్కుని అంబానీకి దోచి పెడుతున్నారని రాహుల్‌ పేర్కొన్నారు.

 

 

 

tags : rahul, ramleela, delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *