ప్రశ్నించే గొంతుకవుతా : ఉత్తమ్ పద్మావతి

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్ :  హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తనను గెలిపిస్తే అసెంబ్లీ లో ప్రశ్నించే గొంతుకవుతానని కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకవీడు మండలం, బెట్టే తండాలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పద్మావతి రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ హుజూర్ నగర్ అభివృద్ధికాంగ్రెసుతోనే సాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తనను గెలిపిస్తే అసెంబ్లీ లో ప్రశ్నించే గొంతుకవుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.  నేరేడుచర్ల మండలంలోని పలు గ్రామాల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హుజూర్ నగర్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని ఉత్తమ్ పద్మావతిని గెలిపిస్తే ఎంపీ కోటా నుండి ప్రత్యేక నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికుల గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు.అనంతరం మండలంలోని టి‌ఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ చేరారు. ఈ కార్యక్రమంలో ఎం‌ఎల్‌సి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, టి జె ఏస్ అధ్యక్షుడు కోదండరాం తదితరులు పాల్గొన్నారు.

 

tags : byelections, hnr, cong

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *