ప్రభాస్ బర్త్ డే కానుకగా ‘సాహో’ మేకింగ్ వీడియో?

ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు
ఆ రోజు కోసం అభిమానుల వెయిటింగ్
షూటింగు దశలో ‘సాహో’
ప్రభాస్ తాజా చిత్రంగా ‘సాహో’ రూపొందుతోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపైనే ప్రభాస్ అభిమానులంతా దృష్టి పెట్టారు. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ‘సాహో’ నుంచి ఏదో ఒక ఐటమ్ ను వదలవచ్చని అభిమానులు భావిస్తున్నారు.

ఆ మధ్య దుబాయ్ లోని ‘బూర్జ్ ఖలీఫా’ ప్రాంతంలో 25 కోట్లతో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఈ సినిమాకి ఈ యాక్షన్ సీన్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే .. మేకింగ్ వీడియోతో ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతాయో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *