ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి : సూచింద్ర ప్రతాప్ సింగ్

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్ : హుజుర్ నగర్ ఉప ఎన్నిక సందర్బంగా జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని చెక్ పోస్టులలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచింద్ర ప్రతాప్ సింగ్ అన్నారు. ఆదివారం హుజుర్ నగర్ లోని కోదాడ వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాల నుండి మంచి స్పందన వస్తుందని ఆయన తెలిపారు. నియోజక వర్గంలో లిక్కర్, నగదు, ఇతర రూపేణా వస్తువులు అనుమతించరాదని చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన సిబ్బందికి సూచించారు. ప్రచార కార్యక్రమాలలో వినియోగించే వాహనాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని, ప్రజలను ఎలాంటి ప్రలోభాలకు గురిచేసిఉంటే సివిజల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ప్రకారం ఎన్నికల నిబంధనలకు లోబడి చర్యలు ఉంటాయని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం చెక్ పోస్ట్ యందు నిర్వహిస్తున్న రిజిస్టర్లను ఆయన పరిచిలించారు. దసరా పండుగ ఉన్నందున కుటుంబాలతో వెళ్ళే వాహనాలను ఎక్కువసేపు రోడ్డుపై నిలిపి ఇబ్బందులు చేయరాదని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డి.టి రాజశేఖర్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

tags : hnr, vehicles checkup, check post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *