ప్రతిష్టాత్మకంగా…డబుల్ బెడ్రూం : జగదీశ్ రెడ్డి

అక్షిత ప్రతినిధి, సూర్యపేట : పేదల కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు మంత్రి జగదీశ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు విశాలమైన, గౌరవప్రదమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది సీఎం కేసీఆర్ కల. గత ప్రభుత్వాలు నిర్మించిన డబ్బా ఇళ్ల మాదిరిగా కాకుండా కుటుంబ సభ్యులందరికీ సౌకర్యవంతంగా, విశాలంగా ఉండేలా ఇళ్లు నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యం అని ఆయన అన్నారు. ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో ఇళ్లను నిర్మించిన ప్రభుత్వం అర్హత కలిగిన పేదలందరికీ అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రితో పాటు సూర్యపేట జెడ్పీ వైస్ చైర్మన్ జి. వెంకట నారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, డీఆర్‌ఓ చంద్రయ్య, ఆర్డీవో మోహన్‌రావు, సూర్యపేట మున్సిపల్ కమిషనర్ శ్రీరామానుజులు రెడ్డి, జెడ్పీటీసీ జీ. డీ. భిక్షం తదితరులు పాల్గొన్నారు.

 

tags : gjr, doble bedroom houses, srpt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *