పేరుకేనా నిజాంపేట్ కార్పొరేషన్
ప్రజల ఆరోగ్యంపై పట్టింపు లేదా?
నిజాంపేట్ భాజపా అధ్యక్షుడు ఆకులసతీష్
నిజాంపేట్, అక్షిత ప్రతినిధి :
పేరుకేమో పెద్ద కార్పొరేషన్ , భారీ బడ్జెట్ హోదా ఉన్న శివారు కార్పొరేషన్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కనీసం ప్రజల ఆరోగ్యం పట్ల సోయి లేకుండా ఉండడం పౌరులను కరోనా విషయంలో ఎవ్వరి మానాన వారిని వదిలి వేయడం దురదృష్టకరమని నిజాంపేట్ భాజపా అధ్యక్షుడు ఆకుల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు.కరోనా మహమ్మారి దేశాన్ని, రాష్ట్రాన్ని చుట్టు ముడుతున్న తరుణంలో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, అధికార పాలకవర్గం మిన్నకుండి చూస్తూ ఉండడం బాధాకరమని వాపోయారు. నిజాంపేట్ లోని పలు ప్రాంతాలలో కోవిడ్ టెస్టుల కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వ్యాక్సిన్ ప్రతి పౌరుడికి చేరేలా కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం, కమిషనర్ పౌరుల ఆరోగ్యం పట్ల చూపుతున్న అశ్రద్ధను నిరసిస్తూ నేడు ప్రగతి నగర్ కోతుల చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భాజపా నిర్ణయం చేసిందని తెలిపారు. ఈ నిరసనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.