ప్రచారం సరే… రైతుల పరిస్థితేంటి?

ధాన్యం కొనుగోళ్లకై జాడలేని ఐకేపీలు!
ఐకేపీలకై రైతుల పక్షాన కాంగ్రెస్ పోరు
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : పాలకులకు సాగర్ ఎన్నికల ప్రచారం మీద ఉన్న ఆసక్తి రైతుల కోసం లేదని కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి ఆరోపించారు. సీజన్ ఆరంభమై పక్షం రోజులైనా నేటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆరంభించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో వరికుప్పలు, పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి మాట్లాడుతూ యాసంగి సీజన్ ఆరంభమైన దృష్ట్యా ఐకేపీ సెంటర్లను వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉండి రైతు సమస్యలను పరిష్కరించవలసిన ఎమ్మెల్యే సాగర్ లో ఏం చేస్తున్నాడని గతంలో వర్షాకాలం వడ్ల సీజన్లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారం చేయాలని, ఇప్పుడు సాగర్ ఎన్నికలలో ప్రచారం చేయాలని పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోనిఎమ్మెల్యేకు తగిన సమయంలో తగిన రీతిలో రైతులు బుద్ధి చెబుతారని అన్నారు. మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వెంటనే ఐకెపి సెంటర్లు ఓపెన్ చేయాలని, అదేవిధంగా క్వింటాల్ కు రూ.500 రూపాయల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఎందుకంటే రైతులు పండించిన టువంటి దొడ్డు ధాన్యం 13 నుంచి14 శాతం తేమ శాతం ఉండాల్సింది ఈ ఎండలకు ఇప్పుడు కేవలం 7 నుండి 8 తేమ శాతానికి పడిపోయిందన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని కాబట్టి వెంటనే ఐకెపి సెంటర్లును ప్రారంభించి, రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, పిసిసి సభ్యుడు చిరుమర్తి కృష్ణయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి బాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిలి శ్రీనివాస్, కౌన్సిలర్స్ దేశిడి శేఖర్ రెడ్డి, గంధం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ నాయకులు గుండు నరేందర్, దేవేందర్ రెడ్డి, గంగాధర్, రవీందర్ రెడ్డి, శంకర్ రెడ్డి , గుండు శ్రీనివాస్, ఫస్ట్ బీసీ సంఘం వెంకటేష్ గౌడ్, ఎస్సీ సెల్ బెజ్జం సాయి, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *