పోలీస్ పరిశీలకుడిగా సునీల్ కుమార్ మీనా

– – స్వాగతం పలికిన డిఐజి, అదనపు ఎస్పీ

నల్లగొండ, అక్షిత ప్రతినిధి :నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రశాంత నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ పోలీస్ శాఖ పరిశీలకునిగా ఉత్తరాఖండ్ సీనియర్ ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్ మీనా ను నియమించింది.

బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఎన్నికల పోలీస్ పరిశీలకుడు సునీల్ కుమార్ మీనాకు జిల్లా ఎస్పీ, డిఐజి ఏ.వి. రంగనాధ్, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద బొకే అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలుకొని నేటి వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలు, ఎన్నికల విధులలో పాల్గొంటున్న సిబ్బంది వివరాలు, కేంద్ర బలగాలు, ఇతర జిల్లాల నుండి వచ్చిన సిబ్బంది వివరాలను ఆయనకు వివరించారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన రూట్లు, పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకుంటున్న చర్యలను సమగ్రంగా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *