పొల్యూష‌న్ స‌ర్టిఫికెట్ లేక‌పోతే ఆర్సీ సీజ్‌!

న్యూఢిల్లీ:  కాలుష్య నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించే వారిపై మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నుంది కేంద్ర ప్ర‌భుత్వం. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి పొల్యూష‌న్ అండ‌ర్ కంట్రోల్ (పీయూసీ) స‌ర్టిఫికెట్ లేక‌పోతే వాహ‌నం రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్ (ఆర్సీ) సీజ్ చేసే వ్య‌వ‌స్థ‌ను తీసుకొస్తోంది. ఈ వ్య‌వ‌స్థ‌ను అమ‌ల్లోకి తెచ్చే ముందు దీనిపై అంద‌రి అభిప్రాయాలు, స‌ల‌హాలు కోరుతూ న‌వంబ‌ర్ 27న ర‌వాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క్రియ పూర్త‌వ‌డానికి రెండు నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు. ఈ కొత్త వ్య‌వ‌స్థ‌లో భాగంగా వాహ‌న య‌జ‌మాని వివ‌రాల‌ను మోటార్ వెహికిల్స్ డేటాబేస్‌లోకి అప్‌లోడ్ చేస్తారు. ఇలా చేయ‌డం ద్వారా పీయూసీ లేకుండా వాహ‌నం న‌డ‌ప‌డం వాహ‌న‌దారుల‌కు అంత సులువు కాదు. వాహ‌న య‌జ‌మానులు గ‌డువులోపు పీయూసీ స‌ర్టిఫికెట్‌ను పున‌రుద్ధ‌రించుకోవాలి. ఒక‌వేళ అలా చేయ‌క‌పోతే వారికి వారం రోజుల గ‌డువు ఇస్తారు. అప్ప‌టికీ స‌ద‌రు య‌జ‌మానికి పీయూసీ స‌ర్టిఫికెట్ తీసుకోక‌పోతే ఆర్సీని సీజ్ చేస్తారు. రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరిక‌ట్టేందుకు కేంద్రం ఇలాంటి క‌ఠిన చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *