పేద విద్యార్థులకు చేతన చేయూత

నోట్ బుక్స్ పంపిణీ
గోవిందరావుపేట, అక్షిత ప్రతినిధి : విద్యా రంగం అభివృద్ధికి అధికంగా సహకరిస్తున్న స్ఫూర్తిని అభినందించాలని చల్వాయి సర్పంచ్ ఈసం సమ్మయ్య అన్నారు. మంగళవారం చల్వాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర రావు అధ్యక్షతన ఉచిత నోటు పుస్తకాల పంపినీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచి మీ సం సమ్మయ్య హాజరై మాట్లాడారు. ఈ పాఠశాలలో చదివి ప్రస్తుతం సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఖమ్మంలో విధులు నిర్వర్తిస్తున్న తుమ్మల గోపి ఇక్కడి విద్యార్థుల సాధకబాధకాలను గుర్తించి చేతన ఫౌండేషన్ ద్వారా నోటు పుస్తకాలను పంపించడం గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. గ్రామస్తులు పాఠశాలలో చదివిన విద్యార్థులు ఇప్పుడిప్పుడే గ్రామ అవసరాలకు పాఠశాల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పటు అందిస్తున్నారని ముందు ముందు వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి కొంత మంది ముందుకు వచ్చి తమకు తోచిన సహాయాన్ని అందించి గ్రామానికి పాఠశాలకు అభివృద్ధులకు తోడ్పాటు కు తమ వంతు సహకారం అందించాలని ఆయన అన్నారు. అదేవిధంగా పాఠశాల ప్రహరీ గోడ ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హరిప్రసాద్ ఎంపీటీసీలు చాపల ఉమాదేవి గుండెబోయిన శ్రీలత ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాస్ యూ పీ య ఎస్ ప్రధానోపాధ్యాయులు మనేశ్వర్ రావు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *