పేదింటి ఆడబిడ్డలకు కొండంత ఆసరా

సంక్షేమ పథకాల పితామహుడు ‘కేసీఆర్’ 

కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేద ప్రజలకు ఆసరా

కరోనా సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం

206 మంది లబ్ధిదారులకు రూ.2కోట్ల విలువైన చెక్కులు

భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాల పితామహుడని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కొనియాడారు. కరోనా లాంటి సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 206మంది లబ్ధిదారులకు రూ.2,06,23,896 విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను భాస్కర్ రావు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని…దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా, అన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారాన్ని తగ్గిస్తున్నారని ఆయన అన్నారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు. ప్రతీ పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 /- ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ సర్కార్ అని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని…కేవలం టీఆర్ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని అన్నారు.ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్ కే దక్కుతున్నదని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మధార్ బాబా, పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఉదయ్ భాస్కర్, బంటు రమేష్, ఐల వెంకన్న, సాధినేని శ్రీనివాస్, ఇలియాస్, కమిలీ భీంలా నాయక్, గోవింద్ రెడ్డి,వజ్రం, సలీం, చీడళ్ల వెంకటేశ్వర్లు,పత్తిపాటి నవాబ్,అయోధ్య, లక్ష్మీ నారాయణ, నాగార్జునా చారి, అశోక్,సుబ్బారావు, రాజు, దుర్గా రావు, మధు, ఫయాజ్,ఇమ్రాన్, నాగభూషణం, అనిల్ కుమార్, శ్యామ్ ఆర్ఐ సుందర్,వీఆర్వోలు గోపీ, మల్లేశం, జానీ షరీఫ్, ఎంపీపీ అమరావతి సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *