పేదలకు ఆపన్న హస్తం.. బిఎల్ ఆర్

20 రోజులకు సరిపడా సరుకులతో కిట్
తొలి విడత 4 వేలు, ప్రస్తుతం 1500 కిట్ల పంపిణి
కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు ఆపన్న హస్తంలా బిఎల్ ఆర్ కిట్లు ఆసరాగా నిలుస్తున్నాయని కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో బిఎల్ ఆర్ బ్రదర్స్ సహకారంతో హోం ఐసోలేషన్లో ఉన్నటువంటి నిరుపేద కరోనా బాధితులకు బి ఎల్ ఆర్ కరోనా కిట్లను కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నటువంటి నిరుపేద కరోనా బాధితులు కిరాణా సామాన్లు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడకూడదని సదుద్దేశంతో… బిఎల్ ఆర్ కరోనా బాధితులకు కిట్లను అందించేందుకుశ్రీకారం చుట్టారన్నారు. మొదటి విడతలో నాలుగు వేల బిఎల్ ఆర్ కరోనా కిట్లను అందజేయగా రెండో విడత 1500 కరోనా కిట్లను ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయిలో ప్రతీ ఒక నిరుపేద కరోనా బాధితునికి ఈ కిట్లు అందేలా ప్రణాళిక రూపొందించారన్నారు. అన్ని వర్గాలు, కులాల కతీతంగా బిఎల్ ఆర్ కిట్లు అందిస్తున్నామన్నారు. ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు హెచ్చిoచి పేదలకు ఆపద్బాంధవుడుగా నిలుస్తున్న బిఎల్ ఆర్ బ్రదర్స్ కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా బాధితులను గాలికి వదిలేశాయని, ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ త్వరగా వేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు చేసిన సర్వేలలో కోవాక్సిన్ టీకాలు వేయించుకున్న వారికి కేవలం 0.04% మాత్రమే కోవిషిల్డ్ టీకాలు వేయించుకున్న వారికి 0.03% మాత్రమే కరోనా బారిన పడ్డారని, త్వరగా మనమందరికి టీకాలు వేయించినట్లయితే కరోనా నుండి పూర్తి రక్షణ లభిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి వెంటనే ప్రతి ఒక్కరికి టీకాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డప్పు శ్రీనివాస్, కాసర్ల రామారావు, లక్ష్మణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *