పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం : మంత్రి కొప్పుల
జగిత్యాల, అక్షిత ప్రతినిధి : పేదలకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం, వెల్గటూర్, ధర్మారం, గొల్లపల్లి మండలాల్లోని 81మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 26 లక్షల 22వేల విలువైన చెక్కులను కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. పేదల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్‌స్థాయి వైద్యం చేయించుకోలేని వారికి సీఎం సహాయనిధి ద్వారా సీఎం కేసీఆర్ భరోసానిస్తున్నారని పేర్కొన్నారు. వెల్గటూర్ మండలంలో 33 మంది లబ్ధిదారులకు రూ. 1,21, 500, ధర్మారం మండలంలో 23 లబ్ధిదారులకు రూ.6,86,000 బుగ్గారం మండలంలో 14 లబ్ధిదారులకు రూ. 4,04,500గొల్లపల్లి మండలంలో 11 లబ్ధిదారులకు రూ.3,16,500 మంజూరైనట్లు తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.