పూరీ బీచ్‌లో భారీ గణపతి

ఒడిషా : ఒడిషాలోని పూరీ బీచ్‌లో భారీ వినాయకుడు కొలువుదీరాడు. ప్రముఖ కళాకారుడు నవీన్ పట్నాయక్ ఇసుకతో తయారు చేసిన ఈ గణపతికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ఇచ్చిన పిలుపు (ప్లాస్టిక్‌ను నివారిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం..) మేరకు నవీన్ ఈ గణపతిని తయారు చేశాడు. 10 అడుగుల ఎత్తున్న ఈ గణేషుడి చుట్టూ కిరీటం వలే 1000 ప్లాస్టిక్ డబ్బాలు పేర్చాడు. చిన్న ప్లాస్లిక్ ముక్కను కూడా వాడవద్దనీ.. పర్యావరణాన్ని రక్షించాలని క్యాప్షన్ ఇచ్చాడు. సమాజాన్ని ఆలోచింపజేసే ఈ బొమ్మ చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక గణేషుడి గురించి పట్నాయక్‌ను వివరణ కోరగా.. సమాజానికి నా చిత్రాల పట్ల కొంతైనా మార్పు లభిస్తుందన్న ఆశాభావంతో ఈ బొమ్మ తయారు చేశాననీ, గణేష్ చతుర్థి సందర్భంగా ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రజలకు మరోసారి తెలియజేయాని ఈ బొమ్మ వేశానన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన నవీన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పూరీ తీరంలో కొన్ని వందల బొమ్మలు గీశారు. ప్రతి చిత్రంలోనూ సమాజహితం ఉంటుంది. 2019 సంవత్సరానికి గానూ బోస్టన్ ఇంటర్‌నేషనల్ సాండ్ ఆర్ట్ ఛాంపియన్‌షిప్ అవార్డు గెలుచుకున్నారు.

 

tags : ganesh, puri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *