పుర పోరులోనూ గులాబీదే సత్తా – విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి

అక్షిత ప్రతినిధి, మిర్యాలగూడ: అన్ని ఎన్నికల మాదిరిగానే పుర పోరులోనూ గులాబీ విజయ దుందుభి మోగించనుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టణ టిఆర్ ఎస్ అధ్యక్షుడు తిరునగర్ భార్గవ్ అధ్యక్షతన జరిగిన పట్టణ టిఆర్ ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. అసెంబ్లీ నుంచి పంచాయతీల వరకు జరిగిన ఎన్నికల సంగ్రామంలో టిఆర్ ఎస్ తిరుగులేని ఆధిక్యతను చాటుకున్న తీరులోనే పుర పోరులోనూ మళ్ళీ విజయ ఢంకా మోగించనుందన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటలాగా ఉన్న నల్లగొండ జిల్లా మంచులా కరిగిపోయి గులాబీ కోటగా పరిఢవిల్లు తుందన్నారు. సీఎం కేసీఆర్ తోనే నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పలు అభివృద్ది పనులు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయన్నారు. కౌన్సిలర్ పదవికి అత్యధికులు పోటీ పడుతున్నప్పటికి.

పదవులు రానివాళ్ళు నిరాశ చెందవద్దు..

కాస్తా సహనంతో ఉంటే పదవులు అవే వస్తాయన్నారు.రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సహకారంతో మిర్యాలగూడ రూపురేఖలు మారుతున్నాయన్నారు. మిర్యాలగూడను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావ్ మాట్లాడుతూ రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ రూ.200 కోట్లు కేటాయించారని…అందుకు అనుగుణంగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. గతంలో మిర్యాలగూడ పట్టణంలో 38 వార్డులకు గాను 31 గెలిచామని… ప్రస్తుతం 48 వార్డుల్లోనూ విజయం సాధించగలమన్న ధీమా వ్యక్తం చేశారు. అందరూ కలిసి సమిష్టి గా పనిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో టిఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని బాబు, పట్టణ అధ్యక్షుడు తిరునగర్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *