పిరీడ్ డ్రామా చేయనున్న మహేశ్

పిరీడ్ డ్రామా చేయనున్న మహేశ్

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘పందెం కోడి 2’
* ‘ఇకపై బయోపిక్ లు చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అంటోంది కీర్తి సురేశ్. ‘మహానటి ఒక మేజిక్. మళ్లీ సావిత్రి పాత్రను చేయమన్నా అలా చేయలేను. అది అలా జరిగిపోయిందంతే. అందుకే ఆ పాత్రను మళ్లీ ముట్టుకోకూడదనుకున్నా. ఈ కారణం వల్లే ఎన్టీఆర్ బయోపిక్ చేయలేదు. అసలు ఇకపై ఏ బయోపిక్ కూడా చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అని చెప్పింది కీర్తి.
* ప్రస్తుతం చేస్తున్న ‘మహర్షి’ చిత్రం తర్వాత మహేశ్ బాబు తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రం పిరీడ్ డ్రామాగా రూపొందుతుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పని ప్రస్తుతం జరుగుతోంది.
* విశాల్ హీరోగా నటించిన ‘పందెం కోడి 2’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా రేపు విడుదల చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *