పాఠశాలలు తెరువాలి

డిసెంబర్ ఒకటి నుండే పాఠశాలలు ప్రారంభిoచే       విధoగా ప్రణాళిక సిద్ధం చేయాలి

ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘ నాయకుల విజ్ఞప్తి

సూర్యాపేట, అక్షిత బ్యూరో :

కోవిడ్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది మూత పడిన పాఠశాలలు నిబంధనలు పాటిస్తూ డిసెంబర్ ఒకటి నుండే ప్రారంభించే విదంగా, ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షులు నామ నాగయ్య ప్రభుత్వాన్ని సూచించారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని
సంఘ కార్యాలయంలో నిర్వహించిన మొదటి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, డిసెంబర్ ఒకటి నుండి పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది విద్యార్థులు నష్టపోకుండా నూతన విద్యా సంవత్సరంను కొనసాగించాలని సూచించారు.ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు హుస్సేన్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డిఏ, పీఆర్సీ, పీఈటీ, భాషాపండితుల అప్గ్రేడేషన్, ఎస్జిటి,స్కూల్ అస్సైస్టెంట్, హెచ్ఎంల ప్రమోషన్స్ వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు మంగళపల్లి అయోధ్య మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఎంఈఓ,హెచ్ఎం పోస్టులు, అంతర్ జిల్లా బదిలీలు, అన్ని రకాల ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు దైద పాపయ్య , జిల్లా ఉపాధ్యక్షులు ఉబ్బపల్లి బాలయ్య, కోశాధికారి ఆంగోతు రామ్ సింగ్ ,జిల్లా ఉపాధ్యక్షులు నెమ్మది ఉపేందర్, జానీ ,నవిరే వెంకన్న , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *