పల్లె పకృతి వనాలు పటిష్ట వంతంగా చేపట్టాలి

దేవరకొండ, అక్షిత ప్రతినిధి : జిల్లాలో కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం దేవరకొండ,మర్రి గూడ మండలంలలో పర్యటించనున్న నేపథ్యంలో జి.పి.లలో రికార్డులు, మొక్కల పెంపకం సక్రమంగా నిర్వహించాలని గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ వి.ఎస్.ప్రసాద్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మలు అధికారులను ఆదేశించారు. గురువారం మర్రిగూడ మండలం రామి రెడ్డి పల్లి జి.పి.లో వీరు పర్యటించి పల్లె ప్రకృతి వనం, ఆవెన్యూ ప్లాంటేషన్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బృందం పర్యటన ముందస్తుగా రికార్డులు నిర్వహణ,ప్లాంటేషన్ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. వీరి వెంట జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్, మండల, గ్రామ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *