పల్లా విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం

పల్లా గెలుపునకు పట్టభద్రుల సహకారం కావాలి 

ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయనకు తొలి ప్రాధాన్య ఓటు నమోదు చేయాలి

నల్లమోతు సిద్దార్ధ

 అడవిదేవులపల్లి, అక్షిత న్యూస్ :

నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపునకు పట్టభద్రుల సహకారం కావాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు తనయుడు, టీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్ధ ఆకాంక్షించారు. ఈనెల14న జరుగనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికలో డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి తొలి ప్రాధాన్యం ఓటు నమోదు చేసి మరోసారి గెలిపించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. శనివారం అడవిదేవులపల్లి మండలంలో పట్టభద్రులైన ఓటర్లను స్వయంగా కలిసి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేయాలని సిద్దార్ధ అభ్యర్ధించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లకు నమూనా బ్యాలెట్ పత్రాన్ని ప్రదర్శించి అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. యువత కు ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన గురించి ప్రతిపక్షాల అసత్య, తప్పుడు ప్రచారాలను టీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు ఎప్పటికప్పుడు ఖండించాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి, రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి గురించి పట్టభద్రులకు వివరించి చైతన్యపర్చాలని సూచించారు. ఎన్నికల నియమావళి కోడ్ ముగిసిన అనంతరం మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుందని ఆయన భరోసా ఇచ్చారు. యువతను తప్పుదోవ పట్టించేందుకు, గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ప్రయివేట్ రంగంలో 14 లక్షల ఉద్యోగాలను ఆరేండ్లలో సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దేనని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఆయన మార్గదర్శనంలోనే యువత పయనిస్తున్నారని అన్నారు. ప్రతీ గ్రాడ్యుయేట్ ను స్వయంగా కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలో డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్ధిస్తున్న కార్యకర్తలను నల్లమోతు సిద్దార్ధ ఈ సందర్భంగా అభినందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం తథ్యం అని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లిఫ్టు ఇరిగేషన్ స్కీములను మంజూరు చేశారని అన్నారు. నియోజకవర్గానికి రూ.529కోట్ల8 లక్షల వ్యయంతో మూడు లిఫ్టు ఇరిగేషన్ స్కీములను మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే భాస్కర్ రావుకే దక్కుతుందని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం రాష్ట్రంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా విరజిల్లానున్నదని అన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి అయినట్టయితే స్థానిక యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పోలు నాగార్జున, అడవిదేవులపల్లి ఎంపీపీ బాలాజీ నాయక్, జడ్పీటీసీ కుర్ర సేవ్యా నాయక్, వైస్ ఎంపీపీ కూరాకుల మల్లేశ్వరి గోపీనాథ్, ఎంపీటీసీ పేర్ల లింగయ్య, అడవిదేవులపల్లి సర్పంచ్ కొత్త మార్రెడ్డి, ముదిమాణిక్యం సర్పంచ్ సింగన్న, పట్టభద్రులు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *